Site icon HashtagU Telugu

Pushpa 2: పుష్పతో స్టెప్పులేసేందుకు శ్రీలీల రెడీ.. !

Sreeleela Item Song

Sreeleela Item Song

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌తో రాబోతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించడంతో పుష్ప 2 సీక్వెల్ పై విపరీతమైన బజ్ ఏర్పడింది. మే ఎండింగ్ కి షూటింగ్ కంప్లీట్ చేసి ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్ కు సెపెరేట్ అభిమానులున్నారు. ఊ అంటావా ఉహు అంటావా అంటూ సాగే పాటకు సామ్, బన్నీ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. కాగా పుష్ప 2 లో ఐటం సాంగ్ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

పుష్ప 2 లో ఐటం సాంగ్ కోసం మొదట్లో బాలీవుడ్ భామని రంగంలోకి దింపుతున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలో కృతి సనన్, దిశా పటానీ పేర్లు వినిపించాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ శ్రీలీల పేరు వినిపిస్తోంది. శ్రీలీల డ్యాన్స్ ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే. అదరగొట్టేస్తోంది.. రీసెంట్ గా మహేష్‌ బాబుతో సైతం అదరగొట్టేలా డ్యాన్స్ వేసేలా చేసింది గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో. ఈ అమ్మడుకు యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. అందుకనే పుష్ప 2 లో శ్రీలీలతో ఐటం సాంగ్ చేయించాలి అనుకుంటున్నారట.

బన్నీ సూపర్ డ్యాన్సర్.. శ్రీలీల కూడా సూపర్ డ్యాన్సరే. ఇక వీరిద్దరూ కలిస్తే.. ఐటం సాంగ్ లో డ్యాన్స్ చేస్తే.. ఇక ఆ పాట ఎలా ఉంటుందో.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఊహించుకోవచ్చు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. శ్రీలీల ఐటం సాంగ్ వార్త బయటకు వచ్చినప్పుడు నుంచి ఇది నిజమా..? లేక పుకారా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ గా మారింది. మరి.. త్వరలోనే బన్నీ కానీ.. సుక్కు కానీ.. శ్రీలీలతో ఐటం సాంగ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: Ram Charan Game Changer : దసరాకి గేమ్ చేంజర్.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదా..?