Sreeleela Lip Lock : ఫస్ట్ కిస్ అతడికే ఇస్తానంటున్న శ్రీలీల

ముందు తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని చెప్పిన ఆమె ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాత్రం తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పింది

Published By: HashtagU Telugu Desk
Sreeleela Liplock

Sreeleela Liplock

లిప్ లాక్ (Lip Lock) అనేది ఇప్పుడు తెలుగు లో కూడా కామన్ అయ్యింది. ఒకప్పుడు లిప్ లాక్ సీన్లు చూడాలంటే హాలీవుడ్ (Hollywood Lip Lock)..ఆ తర్వాత బాలీవుడ్ (Bollywood) లో చూసేవారు..కానీ ఇప్పుడు తెలుగు లో కూడా చాల కామన్ అయ్యాయి. అసలు లిప్ లాక్ లేని సినిమానే ఈ మధ్య లేదనే చెప్పాలి. సినిమాలో ఎన్ని లిప్ లాక్ సీన్లు ఉంటె నిర్మాతలకు అంత కనకవర్షమే. అందుకే డైరెక్టర్స్ ను ఏరికోరి లిప్ లాక్ సీన్లు ఉండేలా చూడాలని ముందే చెపుతున్నారు. ఇక హీరోయిన్లు సైతం ఏమాత్రం ఆలోచించకుండా లిప్ లాక్ సీన్లు చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల (Sreeleela Lip Lock) ను లిప్ లాక్ గురించి అడిగితే చాల తెలివిగా సమాధానం చెప్పి ..అమ్మడు మామూలుది కాదులే అనుకునేలా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ అంటే శ్రీ లీలే అని ఎవరైనా చెపుతారు. అగ్ర హీరోల నుండి యంగ్ హీరోల వరకు అంత శ్రీలీల జపమే చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు చేతిలో దాదాపు డజన్ కు పైగానే తెలుగు సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అమ్మడు స్కంద , భగవంత్ కేసరి మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్కంద మూవీ డిజాస్టర్ కాగా..భగవంత్ కేసరి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల వరుస ఇంటర్వూస్ ఇస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఆమె టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారు? అని ఓ యాంకర్ అడిగింది. ఈ ప్రశ్నకు ఆమె తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ముందు తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని చెప్పిన ఆమె ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాత్రం తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పింది. అంటే ఒక్కమాటలో మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే లేదని శ్రీలీల తేల్చి చెప్పిందని అంటున్నారు. అయితే నిజానికి ఆమె గతంలోనే ఒక లిప్ లాక్ సీన్ చేసిందని నెటిజన్లు అంటున్నారు. 2019లో శ్రీ లీల కిస్ అనే ఒక కన్నడ సినిమా చేసింది, దాన్ని ఐ లవ్ యూ ఇడియట్ అనే పేరుతో తెలుగులో ఆహా రిలీజ్ చేసింది. అయితే ఆ సినిమాలోనే ఆమె హీరో విరాట్ కి మూతి ముద్దు ఇచ్చేసింది అని ఇప్పుడు అసలు ఎవరికీ ఇవ్వను అన్నట్టు చెబుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read Also : shreya dhanwanthary : హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తున్న శ్రేయ ధన్వంతరి

  Last Updated: 26 Oct 2023, 04:32 PM IST