Site icon HashtagU Telugu

Sreeleela: శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ‘రొటీన్’ పాత్రలు, యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ డిజాప్పాయింట్‌

Sreeleela

Sreeleela

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకును ఎంటర్ టైన్ చేస్తోంది. ఇటీవలనే నందమూరి బాలకృష్ణ కుమార్తెగా నటించిన “భగవంత్ కేసరి”లో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలు అందుకుంది. రొమాంటిక్ ట్రాక్ లేదా యుగళగీతాలు లేకుండా తెలంగాణ యాసలో డైలాగులతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే వరసగా వస్తోన్న సినిమాల్లో కమర్షియల్ సినిమాల హీరోయిన్ గా రెగ్యులర్ రోల్ లోకి శ్రీలీల కనిపిస్తోంది.

“ఆదికేశవ” ట్రైలర్ ను చూస్తే శ్రీలీల “రొటీన్” పాత్ర కలిగి ఉందని సూచిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 24 న విడుదల కానుంది. అదేవిధంగా, “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”లో, ఆమె నితిన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది. ఇందులో కూడా రొటీన్ పాత్రే అని తెలుస్తుంది. శ్రీలీల ఇప్పటికే “స్కంద”లో తన ‘రొటీన్’ పాత్ర చేయడంపై  అభిమానుల్లో విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’లో శ్రీలీల పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇక శ్రీలీల నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ భామకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. శ్రీలీలకు ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం కల్కీ అనే ఓ ఫాంటసీ, యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య కమర్షియల్ యాడ్స్ చేస్తున్న శ్రీలీల బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

Also Read: TTD: తిరుమలలో ఘనంగా కార్తీక దిపోత్సవాలు, ఉప్పొంగిన భక్తిభావం

Exit mobile version