Site icon HashtagU Telugu

Sreeleela Dating : అతడితో శ్రీలీల డేటింగ్..?

Sreeleela Dating

Sreeleela Dating

కిస్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela )..ప్రస్తుతం ఓ టాప్ హీరో కొడుకుతో డేటింగ్ లో ఉందనే వార్తలు బాలీవుడ్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు లో ధమాకా (Dhamaka) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఒక్కసారిగా టాప్ పొజిషన్ కు చేరుకున్న శ్రీలీల…ఆ తర్వాత అంతే స్పీడ్ గా ఛాన్సులు లేనంతగా పడిపోయింది. కెరియర్ లో ఇప్పటివరకు డజన్ కు పైగానే సినిమాలు చేసిన అందులో హిట్ అయ్యినవి మాత్రం మూడు . రెండే. దీంతో అమ్మడిని ఐరెన్ లెగ్ జాబితాలోకి చేర్చారు. కాకపోతే సుకుమార్ పుణ్యమా అని పుష్ప 2 లో కిస్సింగ్ సాంగ్ (Kissing Song) చేసే ఛాన్స్ ఇవ్వడం, ఆ సాంగ్ సూపర్ హిట్ కావడం తో మళ్లీ శ్రీలీల వైపు దర్శక , నిర్మాతలు చూపులు పడ్డాయి.

CBN Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు..ఎందుకో..?

కానీ ఈ అమ్మడి చూపులు మాత్రం మరో హీరో పై పడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీలీల ఇటీవల సైఫ్ అలీఖాన్ కొడుకు(IbrahimAliKhan)తో ఎక్కువగా కనిపిస్తుండడం తో అతడితో డేటింగ్ లో ఉందనే వార్తలు బయటకువస్తున్నాయి. ఇటీవల శ్రీలీల.. ‘స్త్రీ 2’ సినిమా నిర్మించిన మాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి వెళ్ళినట్లు తెలుస్తొంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం కూడా అక్కడే ఉండడం.. ఇద్దరు బయటకు వచ్చాక కెమెరాలకు పోజులు ఇవ్వడం చూసి ఇద్దరు మంచి స్వింగ్ లో ఉన్నారే అని మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు. మరి నిజంగా ఆమె డేటింగ్ లో ఉందా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం తెలుగు లో నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజ తో ‘మాస్ జాతర’ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది ఈ కిస్సిక్ పాప.

Exit mobile version