Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 10:42 PM IST

అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు..చిత్రసీమలో రాణించాలంటే గ్లామర్..నటనే కాదు అదృష్టం కూడా ఉండాలి..దాంతో పాటు హిట్స్ కూడా ఖాతాలో పడాలి..అప్పుడే చిత్రసీమలో రాణిస్తారు. హీరోలైన , హీరోయిన్స్ అయినా ఇలా ఎవరైనా సరే..హిట్లు పడితేనే ఇండస్ట్రీ లో ఛాన్సులు వస్తాయి. ఒకటి , రెండు ప్లాపులు పడితే అంతే సంగతి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ విజయాలు సాధించిన డైరెక్టర్లు , హీరోలు , హీరోయిన్స్ ఇలా చాలామంది ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక..సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో పూట గడవడం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇండస్ట్రీ లో హిట్ అనేది తప్పనిసరి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల పరిస్థితి ఇక గడ్డుకాలమే అని అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం అమ్మడి ఖాతాలో వరుసగా ప్లాప్స్ పడడం తో అమ్మడిని తప్పించి..ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్లను నిర్మాతలు ఫిక్స్ చేస్తున్నారు. పెళ్లి సందD మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ చిన్నది..మొదటి సినిమాతోనే తనదైన డాన్స్ , గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా మూవీ అమ్మడి జతకన్నే మార్చేసింది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ధమాకా హిట్ తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి. కానీ హిట్లు మాత్రం అమ్మడి ఖాతాలో పడలేదు. వరుసగా ఒకదానిని మించి ఒకటి ప్లాప్ అవుతుండడం తో అమ్మడిని ఐరెన్ లెగ్ కిందకు మార్చేశారు. అమ్మడు ఉంటె ఎంత పెద్ద హీరో చిత్రమైన ప్లాప్ అవుతుందని ఫిక్స్ అవుతున్నారు. దీంతో గతంలో ఈమెను సెలెక్ట్ చేసిన నిర్మాతలు ఇప్పుడు అమ్మడిని తప్పించి ఆమె ప్లేస్ లో మరొకర్ని ఎంపిక చేస్తున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ మూవీ నుండి శ్రీలీల ను తప్పించినట్లు తెలుస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మార్చి నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది. కాగా ఈ చిత్రంలో కథానాయికగా మొద‌ట శ్రీలీల ను ఎంపిక చేసారు. కానీ ఇప్పుడు ఆమెను తప్పించి , ఆమె ప్లేస్ లో యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన‌ట్లు సమాచారం. కాగా దీనిపై చిత్ర‌బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ లో విజయ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. మొత్తం మీద ఇక శ్రీలీల హావ పూర్తిగా తగ్గడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Also : Guntur Kaaram Collections: గుంటూరు కారం కలెక్షన్స్ లో నిజమెంత?