Site icon HashtagU Telugu

Adikeshava : శ్రీలీలకు ఊహించని షాక్ ఇది..!

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

Adikeshava తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న శ్రీలీల అరడజను సినిమాల దాకా చేస్తుంది. ధమాకా హిట్ తో ఒకేసారి 8 సినిమాల దాకా ఓకే చేసిన శ్రీలీల వాటిలో ఏది ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందో ఊహించలేకపోయింది. రాం తో స్కంద సినిమా చేసిన శ్రీ లీల ఆ సినిమా ఫెయిల్యూర్ కాస్త డిజప్పాయింట్ చేసినా బాలకృష్ణ భగవంత్ కేసరి హిట్ అవడంతో బ్యాలెన్స్ చేసింది. భగవంత్ కేసరి లో శ్రీలీల నటన ఆడియన్స్ కి నచ్చేసింది.

ఇక హిట్టు పడ్డది కదా అనుకునేలోగా ఆదికేశవతో మరోసారి ట్రాక్ తప్పేసింది అమ్మడు. శ్రీలీల ఖాతాలో మరో ఫెయిల్యూర్ పడింది. వైష్ణవ్ తేజ్ శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ సినిమాను శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి డౌట్ గానే ఉండగా రిలీజ్ తర్వాత ఊహించినట్టుగానే సినిమా దెబ్బేసింది.

భగవంత్ కేసరి హిట్ తో జోష్ మీద ఉన్న శ్రీ లీల ఆదికేశవ ఫ్లాప్ తో మళ్లీ డీలా పడింది. డిసెంబర్ లో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో వస్తుంది శ్రీలీల. ఆ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. సంక్రాతికి సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తుంది. ఈ రెండు సినిమాలు అమ్మడి ఫేట్ ని డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

Also Read : Bigg Boss 7 Ashwini : చేజేతులా చేసుకున్న అశ్విని.. ఆమె వెంటే హౌస్ వదులుతున్న రతిక..!