తెలుగు ప్రేక్షకులను తన నటన, అందంతో ఆకట్టుకున్న శ్రీలీల (Sreeleela ) ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్‌గా మారింది. పెళ్లి సందD చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తరువాత ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ తదితర తారలతో సినిమాలు చేయడం ద్వారా టాప్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీ గా మారింది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ చిత్రం దిలర్తో హిందీ పరిశ్రమలో ఎంట్రీకి రెడీ అవుతోంది.
Nani Paradise : ఫ్యాన్సీ ధరకు “ప్యారడైజ్” ఆడియో రైట్స్ !
ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ చిత్రం చేస్తోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా, అందులో కార్తీక్‌తో లిప్‌లాక్ సీన్ ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ముంబైలో ఎక్కువగా కనిపించడమే కాక, కార్తీక్ ఇంట్లో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కు కూడా హాజరైనట్టు వార్తలొస్తున్నాయి. వీటితోపాటు ఇటీవల కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ “మా అబ్బాయికి డాక్టర్ అయిన అమ్మాయే సరిపోతుంది” అనే వ్యాఖ్యలు ఈ జంట మధ్య ఉన్న రిలేషన్‌పై మరింత ఆసక్తి పెంచాయి. కాగా శ్రీలీల కూడా డాక్టర్ చదువుతుండడం కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ కు బలం చేకూరినట్లు అయ్యింది
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని చర్చలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరూ దిగిన మిర్రర్ సెల్ఫీ మరోసారి ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఇదే క్రమంలో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం మొదలైంది. మరి నిజంగా కార్తీక్ ను శ్రీలీల పెళ్లి చేసుకుంటుందా..? అనేది చూడాలి.