శ్రీలీల (Sreeleela )..శ్రీలీల ..ప్రస్తుతం యూత్ అంత ఈ పేరే జపం చేస్తున్నారు. పెళ్లి సందD (Pelli SandaD) తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ..ధమాకా చిత్రం అమ్మడిని పాపులర్ చేసింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారింది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన నటిస్తుంది. మహేష్ , పవన్ , నితిన్ ఇలా చాలామందితో సినిమాలు చేస్తుంది. అయితే అమ్మడికి ఇప్పుడు వరుస ప్లాప్స్ పడుతుండడం తో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join.
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద (Skanda movie) మూవీ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన స్కంద..భారీ డిజాస్టర్ కావడమే కాదు ఎన్నో రకాలుగా ట్రోల్ అయింది. ఈ మూవీ తో శ్రీలీల హ్యాట్రిక్ విజయం అందుకుంటుందని అనుకుంటే భారీ ప్లాప్ అందుకుంది. దీని తర్వాత విడుదలైన భగవంత్ కేసరితో ఫామ్ లోకి వచ్చినా.. ఇందులో శ్రీలీల హీరోయిన్ కాదు.. బాలయ్య కూతురు పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు ఆదికేశవ్ (Adhikeshav) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఔట్ డేటెడ్ కథతో వచ్చిన ఆదికేశవ మూడు రోజులు కూడా ఆడేలా కనిపించడం లేదు. దీంతో అమ్మడి ఖాతాలో మరో ప్లాప్ పడ్డట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు. అంతే కాదు కృతిశెట్టి తో శ్రీలీల ను పోలుస్తున్నారు. ఉప్పెన తో హిట్ కొట్టిన కృతి..ఆ తరువాతః హ్యాట్రిక్ వియజయాలు అందుకుంది. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడడంతో అమ్మడికి ఇప్పుడు సినిమాలు లేకున్నా అయిపోయింది. దీంతో శ్రీలీల కెరియర్ కూడా అలాగే అవుతుందా అని అభిమానులు ఖంగారు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో గుంటూరు కారం, నితిన్ , పవన్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఏ మూవీ విజయం సాధిస్తుందో చూడాలి.
Read Also : Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..