Site icon HashtagU Telugu

Sreeja-Kalyan Dev : శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఈ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసినట్టే..

Sreeja Kalyan Dev Divorce topic viral again kalyan dev post goes viral

Sreeja Kalyan Dev Divorce topic viral again kalyan dev post goes viral

చిరంజీవి(Chiranjeevi) చిన్నకూతురు శ్రీజ(Sreeja), తన రెండో భర్త కళ్యాణ్ దేవ్(Kalyan Dev) తో కూడా విడాకులు(Divorce) తీసుకుందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇద్దరూ అధికారికంగా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కానీ ఇద్దరి సోషల్ మీడియాలో వారి కంబైన్డ్ ఫోటోలు డిలీట్ చేయడం, కళ్యాణ్ సినిమాలకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, కళ్యాణ్ అసలు మెగా ఫంక్షన్స్ లో కనపడకపోవడం, గతంలో వీళ్ళు పెట్టిన పోస్టులతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు అయిపోయాయి అనే తెలుస్తోంది. సాధారణంగా తల్లితండ్రులు విడిపోతే కోర్టులు పిల్లల్ని ఒకరిదగ్గర పెంచడానికి అనుమతి ఇచ్చి ఇంకొకరిని వారానికి ఇన్ని గంటలు వారితో గడపేలాగా చెప్తాయి. అది పేరెంట్స్ మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది.

శ్రీజ – కళ్యాణ్ లకు నవిష్క అనే ఒక కూతురు ఉంది. తాజాగా నవిష్కతో దిగిన ఫోటోలను షేర్ చేసి.. నేను వారంలో గడిపే బెస్ట్ నాలుగు గంటలు ఇవే, డాటర్స్ ఆర్ ది బెస్ట్ అని రాశాడు కళ్యాణ్ దేవ్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కోర్టు కళ్యాణ్ దేవ్ కి తన కూతురితో గడపడానికి వారానికి నాలుగు గంటలే టైం ఇచ్చిందని, అందుకే ప్రతి వారం కళ్యాణ్ వెళ్లి నవిష్కతో గడుపుతాడని, ఈ పోస్ట్ తో వీరిద్దరూ విడాకులు తీసేసుకున్నట్టే అని తెలుస్తుంది. దీంతో మరోసారి శ్రీజ కళ్యాణ్ వార్తల్లో నిలిచారు.