Site icon HashtagU Telugu

Sri Vishnu: ఫుల్ జోష్ లో హీరో శ్రీ విష్ణు.. బర్త్డే సందర్బంగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

Sri Vishnu

Sri Vishnu

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీ విష్ణు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు విష్ణు. ఇకపోతే శ్రీ విష్ణు చివరిగా ఓం బీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఏడాదికీ కనీసం రెండు సినిమాలు నటిస్తూ చాలామంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. శ్రీ విష్ణు ఇప్పటి వరకు తెలుగులో సామజవరగమన, ఓం భీమ్ బుష్, ఉన్నది ఒకటే జిందగీ, అల్లూరి,గాలి సంపత్, మెంటల్ మదిలో, వీర భోగ వసంత రాయలు అంటే చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులు అలరిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ప్రస్తుతం హీరో శ్రీ విష్ణు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీ విష్ణు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త దర్శకుడు యదునాథ్‌ మారుతీ రావుతో ఒక సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జి.సుమంత్‌ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. క్రేజీ రైడ్‌ కోసం రండి. బ్రేకులు లేవు.. నవ్వులు మాత్రమే అంటూ ఆ పోస్టర్‌ ని విడుదల చేయగా ఆ పోస్టర్ పై ఉన్న కాప్షన్ ఇప్పుడు ఆకర్షణగా నిలిచింది.

కాగా శ్రీవిష్ణు ఒక ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హుస్సేన్‌ షా కిరణ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మృత్యుంజయ్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేశారట. విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్ర టైటిల్‌ టీజర్‌ ను విడుదల చేశారు. ఇక టీజర్ లో నేను చెప్పే వరకు గేమ్‌ ఫినిష్‌ కాదు అంటూ ఆఖర్లో ఆయన చెప్పిన డైలాగ్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్లకు టీజర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది.