Site icon HashtagU Telugu

Sree Leela Gifts To Allu Arjun :అల్లు అర్జున్ కు శ్రీలీల ఏ గిఫ్ట్ ఇచ్చిందో గిఫ్ట్ తెలుసా ..?

Sreeleela Gift

Sreeleela Gift

శ్రీలీల (Sree Leela) ..అంటే డాన్స్ ఐకాన్ అని ఎవరైనా అనాల్సిందే. మొదటి సినిమా నుండి మొన్నటి గుంటూరు కారం వరకు ఏ సినిమాలోనైనా డాన్స్ చించేసింది. కానీ సినిమాలే ఆ రేంజ్ లో చించలేకపోయాయి. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ..ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. అతి తక్కువ టైములో ఎక్కువ సినిమాలు చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది కానీ వాటిలో ఏ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే అల్లు అర్జున్ (Allu Arjun) తో చిందులేసిన పుష్ప 2 (Pushpa 2)రాబోతుంది.

పుష్ప 2 లో ఐటెం సాంగ్ లో బన్నీ తో కలిసి చిందులేసింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సాంగ్ పూర్తి అయిన తర్వాత శ్రీలీల అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహారెడ్డి, వారి పిల్లలకి అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చింది. కలర్ లెటర్స్ పై తన అభిప్రాయాలని రాసి గిఫ్ట్ ప్యాక్స్ గా వారికి పంపించింది. అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రాంలో వాటిని షేర్ చేసి శ్రీలీలకి థాంక్స్ చెప్పాడు. ఆమెని డ్యాన్సింగ్ క్వీన్ గా అభివర్ణిస్తూ అల్లు అర్జున్ స్టేటస్ పెట్టడం విశేషం. నువ్వు పంపించిన గిఫ్ట్స్ ఇప్పుడే చూశాను. అందులో నువ్వు రాసిన లెటర్ నా మనసుని తాకింది. నీ ప్రేమకి నా కృతజ్ఞతలు అంటూ బన్నీ మెన్షన్ చేశాడు. అలాగే ఆమె రాసిన లెటర్స షేర్ చేశాడు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా శ్రీలీల పంపించిన లెటర్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ఆతిథ్యానికి శ్రీలీల థాంక్స్ చెప్పింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీల లెటర్ థాంక్స్ చెప్పింది.

Read Also : Petrol Bombs : ‘అమరన్‌’ థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడి..భయంతో ప్రేక్షకులు పరుగులు