Sree Leela : శ్రీలీల గ్యాప్ ఇవ్వడమే బెటర్..!

పెళ్లిసందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ లీల (Sree Leela) రవితేజతో హిట్ కొట్టగానే వరుస ఛాన్స్ లు అందుకుంది.

Published By: HashtagU Telugu Desk
Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

పెళ్లిసందడితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ లీల (Sree Leela) రవితేజతో హిట్ కొట్టగానే వరుస ఛాన్స్ లు అందుకుంది. అరడజను పైగా సినిమాలు చేసిన అమ్మడు వాటి ఫలితాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. లాస్ట్ ఇయర్ శ్రీ లీల నటించిన సినిమాల్లో స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణ భగవంత్ కేసరి మాత్రం హిట్ అయ్యింది. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది అమ్మడు.

We’re now on WhatsApp : Click to Join

4 సినిమాల్లో 3 ఫ్లాప్ ఒకటి హిట్ అందుకున్న శ్రీ లీల మహేష్ గుంటూరు కారం రిజల్ట్ కొంత పర్వాలేదు అనిపించినా ప్రస్తుతం అమ్మడి చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరో సినిమా లేదు. ఆ సినిమా కూడా మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియదు. అయితే ఈ టైం లో శ్రీ లీల సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని చూస్తుంది. ఎలాగు మెడిసిన్ ఎక్సాంస్ కూడా ఉన్న కారణంగా శ్రీ లీల సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇవ్వాలని అనుకుంటుంది.

ఈ గ్యాప్ వరుస ఫ్లాపుల నుంచి ఆమె తీసుకుంటున్న బ్రేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా శ్రీలీల డ్యాన్సుల్లో ఉన్న గ్రేస్ ఆమె ఎంచుకుంటున్న పాత్రల్లో ఉండట్లేదు. అందుకే ఆమెకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి. మరి తర్వాత అయినా కథ విషయంలో అమ్మడు జాగ్రత్త పడితే బెటర్ అని చెప్పొచ్చు.

Also Read : NTR Devara : దేవర రిలీజ్ పై ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్.. ఆ కారణాలతో వాయిదా వేస్తారా..?

  Last Updated: 22 Jan 2024, 09:02 PM IST