న్యాచురల్ స్టార్ నానితో కలిసి జెర్సీ సినిమాలో నటించింది కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్. టాలెంటెడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. ఐతే నాని సినిమా తర్వాత ఆది సాయి కుమార్ తో ఒక సినిమా చేసిన శ్రద్ధ శ్రీనాథ్. ఆ సినిమా తర్వాత వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేసింది. ఆ నెక్స్ట్ విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ చేసింది.
ఆ రెండు సినిమాలు నిరాశ పరచగా లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణతో చేసిన డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ అందుకుంది అమ్మడు. తెలుగులో జెర్సీ తర్వాత తొలి హిట్ అందుకున్న శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా శ్రద్ధ శ్రీనాథ్ సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా ఛాన్స్ అందుకుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమా జైలర్ 2. త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న ఈ సినిమా లో తమన్నా ఒక కథానాయికగా నటిస్తుండగా ఇంపార్టెంట్ రోల్ లో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ లక్కీ ఛాన్స్ తో అమ్మడి కెరీర్ మరింత క్రేజ్ తెచ్చుకునేలా ఉందనిపిస్తుంది.
రజిని సినిమాలో ఛాన్స్ శ్రద్ధాకి మంచి ఫాలోయింగ్ పెంచుతుందని చెప్పొచ్చు. మరి జైలర్ 2 అమ్మడికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.