Sr NTR : సినిమా హిట్ అవ్వదని తెలిసి ఎన్టీఆర్ చేశారు.. అదే చివరి సినిమా అయింది..

తెలుగు మహాకవి శ్రీనాథుడి జీవితం గురించి అందరికి చెప్పాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 09:00 PM IST

నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని ముద్రని వేశారు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత కూడా పలు సోషల్ మెసేజ్ సినిమాల్లో నటించారు. ఈక్రమంలోనే ‘శ్రీనాథ కవి సార్వభౌముడు'(Srinadha Kavi Sarvabhowmudu) సినిమాని కూడా చేశారు. ఇదే ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం. ఈ సినిమాని అగ్ర దర్శకరచయిత బాపు-రమణ(Bapu Ramana)లు తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఆడదు అని తెలిసి కూడా ఎన్టీఆర్ చేశారట.

తెలుగు మహాకవి శ్రీనాథుడి జీవితం గురించి అందరికి చెప్పాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఇక ఈ ఆలోచనని బాపు-రమణలకి తెలియజేశారు. ఎన్టీఆర్ నిర్ణయానికి బాపు-రమణలు బదులిస్తూ.. “సామాన్య ప్రజలకి శ్రీనాథుడి గురించి పెద్దగా తెలియదు. అంతేకాదు శ్రీనాథుడి జీవితంలో కూడా పెద్ద ఆసక్తి కథేమీ ఉండదు. దానిని సినిమాగా తీస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది” అంటూ వెల్లడించారు.

ఇక ఒక విషయాన్ని చేయాలని నిర్ణయించుకున్న ఎన్టీఆర్.. అది కష్టం, నష్టం అని తెలిసినా కూడా వెనకడుగు వెయ్యరు. ఈక్రమంలోనే బాపు-రమణలతో ఎన్టీఆర్.. “నష్టం వచ్చినా పర్వాలేదు. ప్రేక్షాదరణ పొందకపోయినా సమస్య లేదు. మనం శ్రద్ధతో సినిమా చేద్దాం. అందరూ చూడకపోయినా కొందరైనా చూస్తారు కదా. నాకు ఆ తృప్తి, శ్రీనాథుడి పాత్ర చేయాలనే నా కోరిక నెరవేరితే చాలు” అంటూ చెప్పి సినిమాని మొదలుపెట్టారు.

ముందుగా అంచనా వేసినట్లే.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్.. ‘మేజర్ చంద్రకాంత్’ వంటి పవర్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ని అలాంటి రోల్ లో చూసిన తరువాత.. ఆడియన్స్ ఎన్టీఆర్ ని ఓ కవిగా సాఫ్ట్ రోల్ లో పెద్దగా అంగీకరించలేకపోయారు. కాగా ఈ సినిమాలో జయసుధ, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాతోనే స్టార్ కమెడియన్స్ ఏవిఎస్, గుండు సుదర్శన్ ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. కేవీ మహదేవన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

 

Also Read : Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?