Site icon HashtagU Telugu

Sr NTR : పాట లిరిక్స్ విని.. డాన్స్ చేయలేను అన్న ఎన్టీఆర్.. ఏంటి ఆ పాట..?

Sr Ntr denies dance for eduruleni manishi movie songs

Sr Ntr denies dance for eduruleni manishi movie songs

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌(Ashwinidutt).. చిన్న వయసులోనే నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేశారు. 1974లో వైజయంతీ మూవీస్‌ బ్యానర్ స్థాపించి.. తొలి సినిమాగా ఎన్టీఆర్‌(Sr NTR) తో ‘ఎదురులేని మనిషి’(Eduruleni Manishi) సినిమాని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన అశ్వనీదత్.. తానే దగ్గరుండి అభిమానులకు నచ్చేలా కథని సిద్ధం చేసుకున్నారు. ఇక రిలీజ్ అయిన తరువాత ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ వేషధారణ కూడా పూర్తిగా చేంజ్ అయ్యిపోయింది. బాడీ లాంగ్వేజ్‌ నుంచి కాస్ట్యూమ్స్‌, విగ్, ట్రెండ్ కి తగ్గట్టు స్టెప్పులు వేయడం.. వంటివి ఈ సినిమా నుంచే ఎన్టీఆర్ మొదలు పెట్టారు.

ఈ సినిమా షూటింగ్ ఒక పాటతో మొదలైంది. ఆ పాట లిరిక్స్ విన్న ఎన్టీఆర్.. ఈ పాటకి నేను డాన్స్ వెయ్యాలా..? అని ప్రశ్నిస్తూ తాను డాన్స్ చేయలేను అన్నట్లు అశ్వనీదత్ కి తెలియజేశారు. ఇంతకీ ఆ లిరిక్స్ ఏంటంటే.. “కసిగా ఉంది. కసికసిగా ఉంది. కసకసమంటూ నిన్ను నవిలేయమంటుంది” అంటూ కొంచెం ఏ సర్టిఫికెట్ పదాలతో సాంగ్ సాగుతుంది. అయితే ఎన్టీఆర్ కి అప్పటికి 52 ఏళ్ళ వయసు. ఆ ఏజ్ లో అలాంటి లిరిక్స్ తో హీరోయిన్ తో డాన్స్ వేస్తే బాగోదని ఎన్టీఆర్ భావించారు. కానీ అశ్వనీదత్‌ చెప్పిన మాటలకి ఎన్టీఆర్ ఒప్పుకున్నారు.

అశ్వనీదత్.. సార్ మీ అభిమానిగా నాకు మిమ్మల్ని ఏ గెటప్ లో చూడాలి, ఏ పాత్రలో చూడాలని కొన్ని ఆలోచనలు ఉంటాయి. వాటికి తగ్గట్టే నేను దగ్గరుండి కథ సిద్ధం చేయించుకున్నాను. నాలాంటి ఫ్యాన్స్ ఇంక చాలామంది ఉన్నారు. వారంతా ఈ కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు అని చెప్పారట. ఇక ధైర్యంగా తన మనసులో ఉన్న మాటలు చెప్పిన అశ్వనీదత్‌‌ని ఎన్టీఆర్ మెచ్చుకొని.. ఏజ్ లెక్కచేయకుండా ఆ సినిమాలో ప్రతి సన్నివేశం చేసేశారు. కట్ చేస్తే ఆడియన్స్ అందరూ ఎన్టీఆర్ లో కనిపించిన కొత్తదనాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

 

Also Read : Mahesh Babu : ఆ సినిమాలో నటించనని.. మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడు..