Site icon HashtagU Telugu

Balakrishna Birthday : బాలయ్య బర్త్ డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ రెడీ..!

3 Titles for Balakrishna KS Bobby Super Plan

3 Titles for Balakrishna KS Bobby Super Plan

Balakrishna Birthday యువ హీరోలకు ధీటుగా టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అయితే వరుస సినిమాలే కాదు వాటితో సూపర్ హిట్లు కూడా కొట్టేస్తున్నాడు. అఖంద, వీర సిం హా రెడ్డి హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా ఎన్.బి.కె 109 తో కూడా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తైంది.

శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ హైలెట్ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని త్వరలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేస్తారట. ఆల్రెడీ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. బాలయ్య బాబు బర్త్ డే జూన్ 10న ఉంది. సో ఆరోజు సినిమా పోస్టర్ వదిలే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

బాలకృష్ణ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేలా జూన్ 10న ఎన్.బి.కె 109 టైటిల్ తో పాటుగా మరో కొత్త టీజర్ కూడా వదులుతారని తెలుస్తుంది. అంతేకాదు ఆరోజు అఖండ 2 అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఎలక్షన్స్ హడావిడి అయిపోయింది కాబట్టి బాలయ్య మళ్లీ తన పూర్తి ఫోకస్ సినిమాల మీద పెట్టబోతున్నాడని తెలుస్తుంది.

బాలకృష్ణ అఖండ 2 తో పాటుగా ఆదిత్య 999 సినిమా కూడా చేయాలని చూస్తున్నారు. ఆ సినిమాకు బాలయ్య స్వీయ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Also Read : Surya Kanguva : సూర్య కంగువ తెలుగు రైట్స్.. డిమాండ్ బాగానే ఉంది కానీ..!