Sirivennela Seetharamasatri : డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటగా తన కుమార్తె శ్రీజ కొటారుతో ‘స్వప్నాల నావ’ అనే పాటను పాడి నటింపచేస్తున్నారు. దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తూ ఈ పాటని రూపొందిస్తున్నారు. ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా పార్ధసారధి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ పాట రాయగా సీనియర్ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య డైరెక్షన్ చేశారు.
అమెరికాలోని డల్లాస్ లో ఈ స్వప్నాల నావ షూటింగ్ చేయగా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ఆడియో లాంచ్ అమెరికాలో జరగ్గా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గోపికృష్ణ మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. ఆయనే ఉండి ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారు అనే ఆలోచనలో నుంచే స్వప్నాల నావ పాట చేయాలనే భావన కలిగిందని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. శాస్త్రిగారిలాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేసాము. ఈ పాట పాడిన శ్రీజ ప్రొఫెషనల్ సింగర్ అవుతుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయమన్నారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఎన్నిసార్లు కిందపడితే అంతగా మనిషి పైకి వస్తాడని, గోపీకృష్ణ కొత్త ప్రయాణం మొదలుపెట్టారని, ఆయన జర్నీ సక్సెస్ కావాలని, శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించిందని తెలిపారు.
Also Read : Daku Maharaj Ticket Price : ‘డాకు మహారాజ్’ టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్