Naa Saami Ranga: నాగార్జున నటించిన నా సామి రంగ చాలా ప్రత్యేకమైనది. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే మొత్తం పనిని పూర్తి చేసేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఓ సర్ ప్రైజ్ ను ఇచ్చారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉన్నాడట! ‘అంజి’ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆయన పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మా అంజి గాడ్ని మీకు పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటోచ్చేత్తది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంజి గాడి పాత్రకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను డిసెంబర్ 15 ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నారు.
‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్లా.. ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే’ అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్ అందించారు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీపై భారీ అంచనాలున్నాయి.