బాద్షా షారుఖ్ ఖాన్ (Sharukh khan) పఠాన్ తో తిరిగి ఫాం లోకి వచ్చి లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. షారుఖ్ ఫ్యాన్స్ అందరికీ ఆయన మాస్ కంబ్యాక్ క్రేజీగా అనిపించింది. షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా సుజయ్ ఘోష్ (Sujoy Ghosh) డైరెక్షన్ లో చేయబోతున్నారని తెలుస్తుంది. షారుఖ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ విలన్ గా నటించనున్నారట.
ఈమధ్య పాన్ ఇండియా (PAN India) లెవెల్ లో సౌత్ స్టార్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. వాళ్లని బీ టౌన్ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. అందుకే సౌత్ స్టార్స్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో కూడా వాళ్లని తీసుకుంటున్నారు. ఐతే బాలీవుడ్ (Bollywood) ఆఫర్ వస్తే ఏ స్టార్ మాత్రం కాదంటాడు చెప్పండి. అందుకే సౌత్ యాక్టర్స్ కూడా హిందీ సినిమా అవకాశాలను వినియోగించుకుంటున్నాడు.
షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలో సౌత్ స్టార్ నటిస్తాడని తెలిసినప్పటి నుంచి ఆ స్టార్ ఎవరన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అంతేకాదు సౌత్ స్టార్ ని తీసుకుంటున్నారు అంటే షారుఖ్ తన సినిమాను సౌత్ లో కూడా భారీగా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని అర్ధమవుతుంది.
బాలీవుడ్ హీరోలకు అన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ ఉంటారు. ఐతే టాలీవుడ్ (Tollywoo) లో షారుఖ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుఖ్ ఖానే స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించేలా చేయాలని అనుకుంటున్నారు కానీ అది కుదరట్లేదు. అందుకే సౌత్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చూస్తున్నాడు షారుఖ్ ఖాన్. మరి షారుఖ్ తో నటించే ఆ ఛాన్స్ ఎవరు అందుకుంటున్నారన్నది చూడాలి. ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకంటే షారుఖ్ సినిమాలో విలన్ గా నటించేది దాదాపు తెలుగు నటుడే అని అనుకుంటున్నారు.
Also Read : Pooja Hegde : కొత్త అందాలతో మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..!