Trisha : సౌత్ నెంబర్ 1 త్రిష.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!

Trisha రెండు దశాబ్ధాలుగా సౌత్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న త్రిష ఇప్పటికీ కోలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. మిగతా హీరోయిన్స్ ను దాటుకుని త్రిష తన ఫాం

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 01:36 PM IST

Trisha రెండు దశాబ్ధాలుగా సౌత్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న త్రిష ఇప్పటికీ కోలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. మిగతా హీరోయిన్స్ ను దాటుకుని త్రిష తన ఫాం కొనసాగిస్తుంది. కొన్నాళ్లుగా కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నయనతార ఉండగా ఆమెను బీట్ చేసే ఛాన్స్ ఎవరికి రాదని ఫిక్స్ అయ్యారు.

కానీ అనూహ్యంగా త్రిష ఆ ప్లేస్ ను దక్కించుకుంది. పి.ఎస్ 1, 2, లియో సినిమాలతో త్రిష ఆకట్టుకుంది. అంతేకాదు ఆమెతో వరుస సినిమాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా త్రిష వరుస ఆఫర్లు అందుకుంటుంది. చిరంజీవి వశిష్ట కాంబోలో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న అమ్మడు మరో సినిమా ఆఫర్ ను అందుకుందని టాక్.

కోలీవుడ్ లో కూడా రీసెంట్ గా ఒక సినిమా కోసం త్రిషని సంప్రదించారని టాక్. ఆ సినిమా కోసం త్రిష 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ప్రస్తుతం త్రిష ఫాం చూసి నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారట. సౌత్ లో 10 కోట్ల రెమ్యునరేషన్ తో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది త్రిష. నయనతార, అనుష్క, తమన్నా, కాజల్ ఇలా ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా త్రిష తన మార్క్ నటనతోం ఆకట్టుకుంటుంది. అందుకే ఆమె వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు.

విశ్వంభర సూపర్ హిట్ పడింది అంటే త్రిషని ఆపడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పటికే త్రిష వరుస ప్రాజెక్ట్ లతో అదరగొడుతుంటే విశ్వభర హిట్ తో అమ్మడు మరో ఐదారేళ్లు ఇదే ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.

Also Read : Gopichand Malineni : మైత్రి మేకర్స్.. గోపీచంద్ మలినేని.. ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్..!