Site icon HashtagU Telugu

Trisha Politcal Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం!

Trisha

Trisha

సౌత్ బ్యూటీ త్రిషకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ తెలుగులోనూ ఆమెకు అభిమానులున్నారు. వయసుపైబడుతున్నా తన అందంతో, నటనతో ఆకట్టుకుంటోంది త్రిష. 39 సంవత్సరాల వయస్సులో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటోంది. తమిళ నటుడు తలపతి విజయ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆమెను ప్రోత్సహిస్తున్నాడు.

అన్ని అవకాశాలను బేరీజు వేసుకున్న తర్వాత త్రిష కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్: ఐ’లో నటి కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సెప్టెంబరు 30న థియేటర్లలో విడుదల కానుంది. త్రిష 2002లో విడుదలైన తమిళ చిత్రం ‘మౌనం పెసియాదే’తో కథానాయికగా అరంగేట్రం చేసింది. తమిళనాడులో సినీనటులకు మంచి క్రేజ్ ఉంది. ఎంజీఆర్, జయలలిత లాంటివాళ్లు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో రాణించినవాళ్లే.