Honey Rose: సినిమాల్లో నటించపోయినా భారీగా సంపాదిస్తున్న బాలయ్య హీరోయిన్. ఎవరో తెలుసా?

మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి తెలిసిందే. ఈమె బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకు

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 02:30 PM IST

మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి తెలిసిందే. ఈమె బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఒక్క మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఈమె అందానికి యువత ఫుల్ గా ఫిదా అయ్యారు. ముట్టుకుంటే కందిపోయే అందం హనీ రోజ్ సొంతం. ఇకపోతే బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె పేరు ఎక్కువగా వినిపించింది.

అంతేకాకుండా హనీ రోజ్ ఎక్కడికైనా ఏదైనా ఈవెంట్లకు వెళుతుంది అంటే అక్కడికి లక్షల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. ఒకప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. అయితే హనీ రోజ్ ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్స్,జువెలరీ షాప్స్ ఓపెనింగ్ లకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇక అటువంటి ప్రదేశాలకు హనీ రోజ్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత హనీ రోజ్ కీ అవకాశాలు క్యూ కొడతాయని అభిమానులు భావించారు.

కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. అయితే అవకాశాలు లేకపోయినా కూడా హనీ రోజ్ మాత్రం భారీగానే సంబాదిస్తోందట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనీ రోజ్ చేతిలో సినిమాలు లేకపోయినా షోరూం, మాల్స్ ప్రారంభోత్సవానికి హనీ రోజ్ లక్కీ హ్యాండ్ గా మారిపోయింది. అలా రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ షోరూం లాంచ్ చేసింది. మెడలో డైమండ్స్ తో పొదిగిన ఓ హారం వేసుకున్న హనీరోజ్ అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పై నుంచి ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇండస్ట్రీలో సినిమా అవకాశాలతో పని లేకుండా కేవలం ప్రమోషన్స్ తో డబ్బు సంపాధిస్తోంది.