ఎవర్‌గ్రీన్ హీరోయిన్ సౌందర్య (Soundarya ) తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. ఆమె నటించిన సినిమాలు, ప్రత్యేకంగా ఆమె అద్భుత నటన ఇంకా అభిమానుల మనసుల్లో నాటుకుని ఉంది. విక్టరీ వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి టాప్ హీరోలతో కలిసి నటించిన సౌందర్య.. ప్రతి సినిమాలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసింది. ఆమె నటించిన చిత్రాల్లో అంతఃపురం చిత్రానికి ప్రత్యేక స్థానం. ఈ సినిమాలో బాలనటుడిగా సౌందర్య కుమారుడి పాత్రలో కనిపించిన కృష్ణ ప్రదీప్ (Krishna Pradeep) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు.
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై తాజా సమాచారం
అంతఃపురం సినిమా తర్వాత కృష్ణ ప్రదీప్ చదువుపై దృష్టి సారించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న అతను సినీ రంగానికి కొంత విరామం ఇచ్చి ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ (Re Entry) ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఈ సినిమా ద్వారా తన కెరీర్‌ను మరోసారి ప్రారంభించాలనుకుంటున్నాడు. దేశభక్తి నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పాత్రపై మంచి ఆసక్తి నెలకొంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం కృష్ణ ప్రదీప్ గురించి ఓ అపోహ విస్తరిస్తోంది. అంతఃపురం సినిమాలో సౌందర్య కుమారుడిగా నటించినందుకే, అతను ఆమె నిజమైన కుమారుడేనని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కృష్ణ ప్రదీప్‌కు, సౌందర్యకు ఎటువంటి బంధం లేదు. ఇది కేవలం సినిమాలో నటించిన పాత్ర మాత్రమే. అయినా నెటిజన్లు ఈ విషయాన్ని తెలుసుకోకుండానే వైరల్ చేస్తున్నారు. అయితే, కృష్ణ ప్రదీప్ మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.