Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సింగల్ వచ్చేసింది..

Sooseki Song Released From Allu Arjun Rashmika Mandanna Pushpa 2

Sooseki Song Released From Allu Arjun Rashmika Mandanna Pushpa 2

Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2’. ఆగష్టులో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రం.. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ తో పాటు మొదటి సాంగ్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగల్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. ఫస్ట్ పార్ట్ ఆల్బంతో పాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్.. సెకండ్ పార్ట్ సాంగ్స్ ని కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

‘సూసేకి’ అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ ని శ్రేయ ఘోషల్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రాస్తి వర్మ ఈ పాటకి డాన్స్ కోరియోగ్రఫీ చేసారు. పాట కోరియోగ్రఫీ చూస్తుంటే కపుల్స్ కి ఈ సాంగ్ ట్రేండింగ్ రీల్ కాబోతుందని తెలుస్తుంది. మరి ఆ లిరికల్ పాటని మీరు కూడా చూసేయండి.

కాగా ఈ మూవీ నుంచి రిలీజైన మొదటి సాంగ్ ‘పుష్ప పుష్ప’.. యూట్యూబ్ లో 100 మిలియన్స్ పైగా వ్యూస్, 2.26 మిలియన్స్ లైక్స్ సంపాదించి అదుర్స్ అనిపించింది. మరి ఈ సెకండ్ సింగల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే, మాస్ ఆడియన్స్ అంతా ఈ మూవీలోని ఐటెం సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ అంటూ సమంత ఒక ఊపు ఊపేసింది. దీంతో సెకండ్ పార్ట్ లోని ఐటెం సాంగ్ పై భారీ హైప్ నెలకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్ తయారు చేసారు..? ఈసారి ఏ భామ పుష్పతో డాన్స్ వేయబోతుంది..? అనేది ఆసక్తిగా మారింది. కాగా యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఈ పాటలో మెరవబోతున్నట్లు సమాచారం.