Site icon HashtagU Telugu

Arundhati : అరుంధతి సినిమాలో ‘పశుపతి’ పాత్ర చేయాల్సింది ఆ తమిళ్ నటుడు.. కానీ సోనూసూద్‌..

Sonusood Replace Tamil Actor Pasupathy in Arundhati Movie

Sonusood Replace Tamil Actor Pasupathy in Arundhati Movie

అనుష్క (Anushka) మెయిన్ లీడ్ లో కోడి రామకృష్ణ(Kodi Ramakrishna) డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘అరుంధతి'(Arundhati). హారర్, సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పటిలో గ్రాఫిక్స్ పరంగా కూడా ఒక వండర్. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శ్యామ్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర అయిన ‘పశుపతి'(Pasupathy) రోల్ ని బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ (Sonu sood) చేశారు. ఆ పాత్రలో తనని తప్ప మరొక నటుడిని ఊహించుకోలేము అంతలా సోనూసూద్‌ నటించాడు.

అయితే ఈ పాత్ర కోసం ముందు అనుకున్నది సోనూసూద్‌ ని కాదు. ఒక తమిళ్ నటుడుని ఈ పాత్ర కోసం అనుకున్నారు. ఆ నటుడు పేరునే తర్వాత ఈ పాత్రకి కూడా పెట్టారు. అతనే తమిళ్ స్టార్ యాక్టర్ పశుపతి. ఈ సినిమాలో విలన్ అఘోర పాత్రలో కనిపించాల్సి ఉంటుంది. పశుపతి అయితే బాగా సెట్ అవుతాడని కోడి రామకృష్ణ అనుకున్నారు. అయితే అఘోర కంటే ముందు కొన్ని సీన్స్ లో పశుపతి రాయల్ లుక్ లో కనిపించాలి. ఆ లుక్స్ లో పశుపతి అంతగా సెట్ అవ్వడం లేదు. దీంతో మూవీ టీం అంతా ఆలోచనలో పడ్డారు.

ఈ సమయంలో ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ మూవీలో విలన్ గా చేసిన సోనూసూద్‌.. అరుంధతి నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ దృష్టిని ఆకర్షించాడు. వెంటనే తనని పిలిపించి రాయల్ లుక్ తో పాటు అఘోర లుక్ స్కెచ్స్ కూడా చూపించారు. అయితే సోనూసూద్ మొదటిలో అఘోర పాత్ర చేయడానికి నిరాకరించారు. ఆ పాత్ర చేయడం ఇష్టంలేక మూవీకి నో కూడా చెప్పారు. అప్పటికీ శ్యామ్‌ ప్రసాద్‌ తనని వదలకపోవడంతో ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా అడిగారు. నిర్మాత ఆ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్దమయ్యి సోనూసూద్ తో ఆ పాత్రని పట్టుబట్టి చేయించాడు. అయితే సోనూసూద్ అయిష్టంగానే చేసినా.. ఆ పాత్ర తన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లా నిలిచిపాయింది.

 

Also Read : Kodali Nani : చిరంజీవి విషయంలో ప్లేట్ మార్చిన కొడాలి నాని..