Site icon HashtagU Telugu

Sonu Sood: మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్, బీహార్‌ వృద్ధుడికి 12 లక్షల సాయం

Sonusood

Sonusood

Sonu Sood: బాలీవుడ్ నటుడు, మానవతావాది సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతో మంది పేదలు, వలస కూలీలు ఇబ్బందులు పడుతుండుటంతో చలించిపోయి  తనవంతు సాయం చేశారు. అంతే కాదు.. ఆనాటి నుంచి నేటి వరకు సోనూసూద్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆపద ఉన్నవారికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతరులకు సాయం చేస్తూ పెద్దన్నగా అందరి మనసులు చూరగొంటున్నాడు.

తాజాగా ఈ హీరో  బీహార్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి తన అప్పులను తీర్చడంలో సాయం చేశాడు. ఖిలానంద్ ఝా అనే వ్యక్తి సోనూను కలుసుకోవడానికి మాత్రమే ముంబై వరకు వచ్చాడు. అతన్ని ‘గరీబో కా మసిహా’ లేదా పేదల మెస్సీయా అని పిలుస్తారు. కష్టాలు, ఆర్థిక భారాలతో చిక్కుకున్న ఝా కథ సోను హృదయాన్ని తాకింది.  అప్పుడే సోనూసూద్ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఝా భార్య మినోతి పాశ్వాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో పక్షవాతంతో మరణించింది. ఆమె వైద్య ఖర్చుల కోసం అతనికి రూ. 12 లక్షల అప్పు మిగిలింది. రుణదాతలు చెల్లింపును క్లియరెన్స్ చేయాలని డిమాండ్ చేయడంతో సోను చేసిన ప్రయత్నాల గురించి విన్న సహాయం కోరాడు. ఝా తన కుమారుడితో కలిసి ఇటీవల సోనుని తన కార్యాలయంలో కలిశారు. నటుడు వృద్ధుడి పరిస్థితిని తెలుసుకొని సోనూ సాయం చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Pomegranate Prices: భారీగా తగ్గిన దానిమ్మ పండ్లు, ప్రస్తుత ధరలివే