Site icon HashtagU Telugu

Sonu Sood : అరుంధతి మూవీకి సోనూసూద్‌ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? దాని వెనుక పెద్ద కథే ఉంది..!

Sonu Sood Remuneration for Arundhati Movie

Sonu Sood Remuneration for Arundhati Movie

బాలీవుడ్(Bollywood) నటుడు సోను‌సూద్(Sonusood) తెలుగు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ.. తనకి మర్చిపోలేని గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ‘అరుంధతి'(Arundhathi). అనుష్క (Anushka) మెయిన్ లీడ్ తో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, అప్పటిలో గ్రాఫిక్స్ పరంగా కూడా ఒక వండర్. 2009 లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన ‘మగధీర’కి గ్రాఫిక్స్ కేటగిరీలో అవార్డ్స్ దగ్గర గట్టి పోటీ కూడా ఇచ్చింది. కోడి రామకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై శ్యామ్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్టార్ హీరో లేకుండా అప్పటిలోనే 70 కోట్ల కలెక్షన్స్ ని అందుకుందంటే ఈ సినిమా ఏ రేంజ్ విజయం అందుకుందో మీరే అర్ధం చేసుకోండి. కాగా సోనూసూద్‌ కి ఈ సినిమా చేయడం పెద్దగా ఇష్టం లేదు. ఈ మూవీలో సోనూసూద్‌ అఘోర పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్ర చేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ తపన చూసి ఏదో మొహమాటంగా ఒకే చెప్పాడు. ఇక ఈ చిత్రంలో సోనూసూద్‌ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని 20 రోజుల్లో పూర్తి చేసేలా దర్శకనిర్మాత ప్లాన్ చేశారు.

ఈ 20 రోజులకు గాను సోనూసూద్‌ రూ.18 లక్షల రెమ్యూనరేషన్ అడిగాడు. అలాగే ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు. ఒకవేళ తనకి రూ.20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా షూటింగ్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. కానీ నిర్మాత ఆ ఆఫర్ తీసుకోలేదు. 20 రోజులోనే షూటింగ్ పూర్తి చేస్తానని చెప్పారట. ఒకవేళ 20 రోజుల్లో పూర్తి కాకపోతే, ఆ తరవాత నుంచి రోజుకి రూ.25 వేలు ఇస్తానని మాట ఇచ్చారు. అయితే చివరికి షూటింగ్ లేట్ అవ్వడంతో సోనూసూద్‌ ఫైనల్ గా అక్షరాలా రూ.45 లక్షల పారితోషకం అందుకున్నాడు. నిర్మాత ముందు చెప్పిన దానికంటే 2 రేట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ ని సోనూసూద్‌ అప్పజెప్పారు.

 

Also Read : Ravi Kishan Daughter: సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కుమార్తె.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు