Sonu Sood Fan: సోనూసూద్ బొమ్మను రక్తంతో గీసిన అభిమాని.. వీడియో వైరల్?

సోను సూద్ కరోనా మహమ్మారి సమయంలో లక్షలాదిమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్న వ్యక్తి.

Published By: HashtagU Telugu Desk
Sonu Sood

Sonu Sood

సోను సూద్ కరోనా మహమ్మారి సమయంలో లక్షలాదిమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్న వ్యక్తి. సినిమాలలో విలన్ పాత్రలలో నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసి రియల్ లైఫ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కరోనా మహమ్మారి సమయంలో జనాల పాలిట దేవుడిగా నిలిచాడు. ఎంతోమంది సోను సూద్ ఫోటోకి దేవుడిలా పూజిస్తూ పూజలు కూడా చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికే ఎంతోమంది అభిమానులు సోను సూద్ పై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు ఆయన పేరు మీద సేవ కార్యక్రమాలు చేయగా మరి కొంతమంది మాత్రం అభిమానాన్ని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మధు గుర్జార్ అనే అభిమాని సోనూసూద్‌ పై తన అభిమానాన్ని చాటుకుంటూ తన రక్తంతో సోసూసూద్‌ పెయింటింగ్‌ వేసి ఆయనకే బహుమతిగా అందించాడు.


అయితే సదరు అభిమాని చేసిన పనికి సోను సూద్ షాక్‌ అయ్యాడు. సోనూసూద్‌ రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేసి ఉంటే ఇంకా సంతోషించేవాడిని అని చెప్పుకొచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్‌ ట్విట్టర్‌లో షేర్‌చేస్తూ రక్తం వృథా చేయకుండా దానం చేయాలని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సోను సిద్ధి విషయానికి వస్తే సోను సూద్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే పలు వాణిజ్య ప్రకటనలలో కూడా నటించి రెండు చేతుల సంపాదిస్తున్నాడు.

  Last Updated: 11 Sep 2022, 12:05 AM IST