Sonu Sood: రేపు తురమ్ ఖాన్ లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా సోనూ సూద్..!

తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో పల్లె కథ చిత్రం "తురుమ్ ఖాన్ లు" (Thurum Khanlu). అత్యంత వైభవంగా జరుగుతున్న ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ (Sonu Sood) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Sonu Sood

Compressjpeg.online 1280x720 Image 11zon

Sonu Sood: తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో పల్లె కథ చిత్రం “తురుమ్ ఖాన్ లు” (Thurum Khanlu). స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తురమ్ ఖాన్ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 31న SVIT కాలేజ్ సికింద్రాబాద్ లో ఘనంగా జరగనుంది. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈవెంట్ కు రీల్ అండ్ రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ (Sonu Sood) ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెర హీరో సోనూ సూద్ చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో సర్వత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. భారీ మొత్తంలో ఈ వేడుకకు అభిమానులు హాజరవుతున్నారు.

తురుమ్ ఖాన్ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన రంగు రంగుల చిలక పాట ఇప్పటికే విడుదలై సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రం అన్ని పనులను ముగించుకొని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎన్. శివకళ్యాణ్ తురుమ్ ఖాన్ లు సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అసిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తారని తెలుగు సినిమా ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న తురుమ్ ఖాన్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా రూపొందించామని, సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, చిన్న సినిమాగా తెరకెక్కినా విడుదల తర్వాత ప్రేక్షకులే దీన్ని పెద్ద సినిమా చేస్తారన్న నమ్మకంతోనే ఆగస్టు 31న ఎస్విఐటి కాలేజ్ సికింద్రాబాద్ లో జరుగునున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సోషల్ హీరో సోనూ సూద్ ను ఆహ్వానించామని మేకర్స్ తెలిపారు.

Also Read: Onam Festival : చీరకట్టులో హీరోయిన్స్ ఎంత అందంగా ఉన్నారో..

నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల,
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్,
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్.
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్ : సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
పీఆర్ఓ: హరీష్, దినేష్

  Last Updated: 30 Aug 2023, 10:36 AM IST