Site icon HashtagU Telugu

Sonu Nigam: బాలీవుడ్ ప్రముఖ సింగర్ పై దాడి

Sonu Nigam

Resizeimagesize (1280 X 720) (4)

సోను నిగమ్ (Sonu Nigam) ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ఎన్నో అద్భుతమైన పాటలకు తన స్వరం జోడించి మరింత అద్భుతంగా తయారు చేశారు. అయితే తాజాగా ముంబైలో జరుగుతున్న కాన్సర్ట్‌లో అపశ్రుతి జరిగింది. సోనూ నిగం బాడీగార్డ్‌కు శివసేన ఎమ్మెల్యే కొడుకు, మేనళ్లుడి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అది కాస్తా కొట్లాటగా మారింది ఈ ఘటనలో సోను నిగమ్ స్నేహితుడికి కూడా గాయాలయ్యాయి. ఈ గొడవలో గాయకుడితో పాటు అతని సోదరుడిపై కూడా దాడి జరిగింది. సోనూ నిగమ్ సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చేరారు. ఈ దాడి నుంచి తన బాడీగార్డ్ తనను సురక్షితంగా రక్షించాడని సోనూ నిగమ్ చెప్పారు.

చెంబూర్‌లో లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌లో ఈ సంఘటన జరిగింది. సోనూ నిగమ్‌తో పాటు అతని సోదరుడిపై శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. కొందరు సోనూ నిగమ్‌పై ఆరోపణలు చేశారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో మెట్లు దిగుతున్నప్పుడు కొంతమంది సోనూ నిగమ్‌పై దాడి చేయడం చూడవచ్చు. గాయకుడి బాడీగార్డ్ జోక్యం కారణంగా సోను నిగమ్ సురక్షితంగా ఉన్నాడు. కానీ అతని సోదరుడు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన అనంతరం సోదరులిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది సోనూ నిగమ్‌తో సెల్ఫీలు దిగడం ప్రారంభించారని, ఆ సమయంలో వారిపై దాడి జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతూ దాడికి పాల్పడిన వారిని ఆరా తీస్తున్నారు.