Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో తెలుసా..?

Songs Details Of Prabhas Deepika Padukone Kalki 2898 Ad Movie

Songs Details Of Prabhas Deepika Padukone Kalki 2898 Ad Movie

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్‌తో.. సి అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి సిద్దమవుతుంది. ఈక్రమంలోనే సాంగ్స్, టీజర్స్, యానిమేషన్ సిరీస్ ని సిద్ధం చేస్తున్నారు.

కాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ గా ‘ట టక్కర టక్క టక్కర.. టక్కర టక్కర టా’ పాటని తీసుకు రాబోతున్నారు. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉండదని సమాచారం. కేవలం ప్రచారం కోసం థీమ్ సాంగ్ గా ఈ పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు సినిమాలో పాటలు ఉన్నాయా..? ఉంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి..? ఈ ప్రశ్నలు ఫిలిం వర్గాల్లో పలు సమాధానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఎక్కువుగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ మూవీలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయట. వాటిలో రెండు రొమాంటిక్ సాంగ్స్ అంట. ఈ రెండు పాటలు అందమైన విజువల్స్ తో అద్భుతంగా ఉంటాయంట. ‘ట టక్కర టక్క టక్కర’ సాంగ్ తో పాటు.. ఈ నాలుగు సాంగ్స్ లో రెండు పాటలని సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారంట. మిగిలిన రెండు పాటలను సినిమాలో వినాల్సిందేనట.

మొదటిగా రాబోతున్న థీమ్ సాంగ్ ‘ట టక్కర టక్క టక్కర.. టక్కర టక్కర టా’.. డాన్స్ నెంబర్ గా ఆడియన్స్ ని బాగా అలరించనుందని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.