Site icon HashtagU Telugu

Sonam Kapoor Father In Law: రూ. 230 కోట్ల‌తో ఇంటిని కొనుగోలు చేసిన సోన‌మ్ క‌పూర్ మామ‌.. ఎక్క‌డంటే..?

Sonam Kapoor Father In Law

Sonam Kapoor Father In Law

Sonam Kapoor Father In Law: బాలీవుడ్ ఫ్యాషన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor Father In Law) చాలా కాలంగా తెరకు దూరంగా తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. నటి సోషల్ మీడియా ద్వారా తన లండన్ ఇంటి ఫొటోల‌ను చూపుతూనే ఉంది. తాజాగా ఈ నటి లండన్‌లో ప్రాపర్టీ డీల్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చింది. నివేదిక‌ల ప్ర‌కారం.. సోనమ్ క‌పూర్ మామ హరీష్ అహూజా లండన్‌లో భారీ ధరకు ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్ప‌డు ఇది చాలా చర్చనీయాంశమైంది. దీని ధర షారుఖ్ ఖాన్ ఇంటి మన్నత్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక చాలా వైరల్ అవుతోంది. ఈ నివేదిక ప్రకారం.. సోన‌మ్ మామ హరీష్ అహుజా లండన్‌లోని నాటింగ్ హిల్‌లో 21 మిలియన్ పౌండ్లు అంటే భార‌తీయ క‌రెన్సీలో 200-240 కోట్ల భారీ ధరతో ఇంటిని కొనుగోలు చేశారని నివేదిక సారాంశం. ఈ ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు భారీగా ధ‌ర‌ పలుకుతోంది. ఈ ఇంట్లో 8 అంతస్తులు ఉన్నాయి. అందులో ఒక అంతస్తులో సోనమ్- ఆనంద్ మారబోతున్నారు. అయితే దీనిపై నటి స్పందించ‌లేదు.

Also Read: Hindi Diwas 2024: హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!

సోనమ్ మామ హరీష్ అహుజా ఎవరు?

సోనమ్ కపూర్ మామ హరీష్ అహుజాను టెక్స్‌టైల్ కింగ్ అంటారు. అతని ‘షాహీ ఎక్స్‌పోర్ట్స్’లో అనేక వస్త్రాల తయారీ కంపెనీలు ఉన్నాయి. అతని కంపెనీ నుండి బట్టలు తయారు చేస్తారు.డెకాథ్లాన్, H&M వంటి అనేక బ్రాండ్‌లకు సరఫరా చేస్తారు. మీడియా నివేదికల ప్రకారం, అతని నికర విలువ రూ. 5900 కోట్ల కంటే ఎక్కువ. లండన్‌తో పాటు ముంబై, ఢిల్లీలో కూడా అతనికి విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.

ఆనంద్ అహుజాను 2018లో వివాహం చేసుకున్నారు

చాలా కాలం డేటింగ్ తర్వాత 2018లో ఆనంద్ అహుజాను సోనమ్ కపూర్ వివాహం చేసుకుంది. తన తండ్రిలాగే ఆనంద్ కూడా వ్యాపారవేత్త. అతను ‘భానే’ పేరుతో ఒక దుస్తుల బ్రాండ్‌ను కూడా నడుపుతున్నాడు. ఈ దంపతులకు ఒక‌ కుమారుడు ఉన్నాడు. సోనమ్ కపూర్ 2020 చిత్రం ‘AK vs AK’లో కనిపించింది. దీని తర్వాత ఆమె ‘బ్లైండ్’ చిత్రంలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ తెరపైకి వస్తారా..? లేదా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.