Site icon HashtagU Telugu

Sonali Bendre: క్యాన్సర్ అని తెలియగానే నా గుండె పగిలింది: సోనాలి బింద్రే

Sonali Bendre

Sonali Bendre

Sonali Bendre: 90ల నాటి కాలంలో ఓ వెలుగు వెలిగిన సినీ నటి సోనాలి బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారు. తాజాగా ఆమె క్యాన్సర్ సమయంలో అనుభవించిన కష్టాల గురించి తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోడ్‌కాస్ట్‌లో సోనాలి తన క్యాన్సర్ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది. 2018 సంవత్సరంలో సోనాలి బింద్రేకు మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె చికిత్స పొందింది మరియు ఆమె ఇప్పుడు క్యాన్సర్ నుంచి బయపడింది.

హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోడ్‌కాస్ట్‌లో సోనాలి మాట్లాడుతూ.. నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, నా హార్ట్ బ్రేక్ అయిందని చెప్పింది. అయితే నాకు క్యాన్సర్ వచ్చినందుకు బాధపడలేదని, ఎందుకంటే అది నా సోదరికి లేదా నా కొడుకుకు రాలేదని కృతజ్ఞతతో ఉన్నానని ఆమె అన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి నాకు శక్తి ఉందని, అధునాతన ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే సదుపాయం కూడా ఉందని అందుకే ఏ మాత్రం ధైర్యం కోల్పుకుండా ఉన్నానని ఆమె చెప్పింది. సోనాలికి 2018లో నాలుగో దశ మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆమె 2021లో క్యాన్సర్ నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తర్వాత క్యాన్సర్ ఉన్నవారి కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాదు రోగులకు తన వంతు సహాయం చేశారు.

We’re now on WhatsAppClick to Join

కాగా డ్రామా సిరీస్ ది బ్రోకెన్ న్యూస్‌తో సోనాలి బింద్రే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. . ఈ షో సీక్వెల్ వచ్చే నెల మేలో ZEE5లో ప్రసారం కానుంది.

Also Read: Bajaj Pulsar NS400: బ‌జాజ్ నుంచి మ‌రో కొత్త బైక్‌.. ధ‌ర అక్ష‌రాల రూ. 2 లక్ష‌లు