Sonakshi Sinha: సోనాక్షి బాత్ రూంలో అభిమాని…వైరల్ అవుతోన్న వీడియో…!!

సోనాక్షి సిన్హా...సల్మాన్ ఖాన్ తో పెళ్లి వార్తలతో తెగ పాపులర్ అయ్యింది ఈ బొద్దుగుమ్మ. ఇప్పుడు తన అభిమాని బెదిరింపు వార్తల్లో నిలిచింది. సోనాక్షి బాత్ రూమ్ లో అభిమాని ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గ్గా మారింది.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 12:36 AM IST

సోనాక్షి సిన్హా…సల్మాన్ ఖాన్ తో పెళ్లి వార్తలతో తెగ పాపులర్ అయ్యింది ఈ బొద్దుగుమ్మ. ఇప్పుడు తన అభిమాని బెదిరింపు వార్తల్లో నిలిచింది. సోనాక్షి బాత్ రూమ్ లో అభిమాని ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గ్గా మారింది. శతృఘ్న సిన్హా తనయగా బీ టౌన్ లోకి అడుపెట్టింది సోనాక్షి. దబాంగ్ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తన అందచందాలతో బాలీవుడ్ ను షేక్ చేసింది. ఈ మధ్యే సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ…సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ్గా సోనాక్షి పేరు వినిపిస్తుండటం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఆమె బాత్ రూమ్ లో ఓ అభిమానం చేరడమే దీనంతటికీ కారణం. సోనాక్షి అంటే ఇష్టమని..పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, కత్తితో గొంతుకోసుకుంటానని బెదిరింపులకు పాల్పడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే…

ప్రస్తుతం సోనాక్షికి పెద్దగా సినిమాలు లేకపోవడంతో కలర్స్ టీవీలో దీ ఖత్రా ఖత్రా అనే షోలో పాల్గొంది. ఆ షోలో భాగంగా సోనాక్షి సెట్ లోని తన కారవ్యాన్ లోకి వెళ్లింది. రిలాక్స్ అవుతూ ఫోన్ చూస్తుండగా…తన కారవ్యాన్ లో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. మీ ఫ్యాన్ ను అంటూ రిక్వెస్ట్ చేస్తూ…మేడమ్ నేను మీకు పెద్ద ఫ్యాన్. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నాని అన్నాడు. అక్కడితో ఆగలేదు తన చేతిపై సోనాక్షి సిన్హా పచ్చబొట్టు వేసుకున్నట్టు కూడా చూపించాడు. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్రతిమిలాడాడు. ఒక్కసారిగా షాక్ అయిన సోనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు…అలాగే చూస్తుండిపోయింది. అద్దంపై లిప్ స్టిక్ తో ఐ లవ్ యూ సోనా అని రాశాడు. ఇది నా రక్తంతో కూడా రాయగలను అని చెప్పాడు. సోనాక్షి సీరియస్ కావడంతో ఆవేశానికి గురై వస్తువులను పడేశాడు. తన జేబులో నుంచి కత్తి తీసి తనను పెళ్లి చేసుకోకపోతే…పీక కోసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సోనాక్షి గట్టిగా అరవడంతో వీడియో క్లోజ్ అయ్యింది.

అయితే ఇది షో ప్రమోషన్ లో భాగంగా చేసిన వీడియో కావొచ్చని అనుకుంటున్నారు. అయితే ఇది ఫ్రాంక్ వీడియో మాదిరిగా సోనాక్షికి తెలియకుండా చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.