బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్టార్ డమ్ ని అందుకుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల ప్రియుడిని పెళ్లి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అటు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇటు సినిమా లైఫ్ లో కూడా బిజీబిజీ అవ్వాలని చూస్తోంది.
ఇప్పటికే ఆ ముద్దుగుమ్మ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఇప్పుడు ఒక మైథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది ఈ బ్యూటీ. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నటి వరకు హిందీలో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో కూడా బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ జటాధర. ఈ సినిమాతోనే సోనాక్షి సిన్హా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ.. ఈ మహిళా దినోత్సవం జటాధారలో బలం, శక్తి దీపస్తంభం ఉదయిస్తుంది. సోనాక్షి సిన్హాకు స్వాగతం అంటూ నెట్టింట లుక్ ని రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందులో నల్లటి కళ్లతో జుట్టు విరబూసుకొని భయపెట్టేలా ఉన్న సోనాక్షి లుక్ తెగ ఆకట్టుకుంటోంది. జటాధర సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన కొత్త లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మాస్ లుక్ లో కనిపిస్తూ తన చూపులతో భయపెడుతోంది. మొదటి లుక్కుతోనే అంచనాలను భారీగా పెంచేసింది. మరి ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.