Site icon HashtagU Telugu

Vernika : ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. గతంలో బన్నీకి కూతురిగా.. ఇప్పుడు పుష్ప పాటతో..

Son Of Sathyamurthy Fame Vernika Dance Reel For Allu Arjun Pushpa 2 Suseki Song

Son Of Sathyamurthy Fame Vernika Dance Reel For Allu Arjun Pushpa 2 Suseki Song

Vernika : టాలీవుడ్ లో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఆడియన్స్ కి పరిచయం అవుతుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంటారు. ఇక ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు.. కొన్నేళ్ల తరువాత సోషల్ మీడియాలో కనిపించి సందడి చేస్తుంటారు. తాజాగా అలా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సందడి చేస్తుంది. ఇంతకీ ఎవరు ఆ చైల్డ్ ఆర్టిస్ట్..?

అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ మూవీలో అల్లు అర్జున్ అన్నయ్య కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా గుర్తుకు ఉండే ఉంటుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఆ బుజ్జి పాప పేరు ‘వెర్నిక’. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో కనిపించిన ఈ పాప.. మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత పుష్ప పాటతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

పుష్ప 2 నుంచి రీసెంట్ గా రిలీజైన ‘సూసేకి’ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి వేసిన ఓ స్టెప్ ఇన్‌స్టా రీల్స్ ట్రేండింగ్ అవుతుంది. ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ సైతం ఈ స్టెప్ ని రీ క్రియేట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే వెర్నిక కూడా సూసేకి పాటకి డాన్స్ వేసి వావ్ అనిపిస్తుంది. ఇక ఆ ఇన్‌స్టా రీల్ చూసిన నెటిజెన్స్.. వెర్నికని గుర్తు పట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి టీనేజ్ కి వచ్చిన ఆ బుజ్జి పాప ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్ వేసేయండి.