Site icon HashtagU Telugu

Sohel : నా సినిమా చూడడానికి ఎందుకు రావట్లేదు..అంటూ కన్నీరు పెట్టుకున్న హీరో సోహెల్

Sohal Crying

Sohal Crying

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ (Sohel ) టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మించిన చిత్రం బూట్‌ కట్ బాలరాజు (Bootcut Balaraju). మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు నటించిన ఈ మూవీ నిన్న (ఫిబ్రవరి 02) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్ , సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ..గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా కోసం సోహెల్ (Sohel ) ఎంతో కష్టపడ్డాడు. ఒక్కడే సినిమా బాధ్యతలను తన భుజాల ఫై వేసుకొని సక్సెస్ ఫుల్ గా రిలీజ్ అయ్యేలా చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ గా పని చేసారు. సినిమా చాల బాగారావడం తో ప్రేక్షకులను సినిమాను చూసేందుకు తరలివస్తారని భావించారు. కానీ ఎక్కడ కూడా సినిమాకు పెద్దగా ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి హీరో సోహెల్ కంటతడి పెట్టుకున్నాడు.

‘ నేను కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే సినిమా చేశాను. కంటెట్ ఉన్న సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారు నాకు తెలుసు. ఇది కూడా అలాంటి మంచి సినిమా. కానీ, ఈ సినిమా మీ అందరికీ రీచ్ అయ్యేలా ఏం చేయాలి. సినిమా బాగుంది. బిగ్​బాస్​లో ఉన్నప్పుడు సపోర్ట్​ చేశారు. ఇప్పుడు ఏమైంది’ అని సోహైల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

https://twitter.com/ActualIndia/status/1753636397750374426?

Read Also : Hiring Mason : తాపీమేస్త్రీ కావలెను.. ఏడాదికి రూ.4.50 లక్షల ప్యాకేజీ