Sobhita Dhulipala : నిన్న దేశమంతా దీపావళి ఘనంగా జరుపుకుంది. ఢిల్లీ లాంటి పలు ప్రాంతాల్లో బాణాసంచా బ్యాన్ చేయగా మిగతా అన్ని చోట్ల క్రాకర్స్ కాలుస్తూ ఘనంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. దీపావళి టపాసుల బాక్స్ ల మీద బొమ్మలు, హీరో, హీరోయిన్స్ ఫోటోలు కూడా వాడతారని తెలిసిందే. వాళ్ళ పర్మిషన్ లేకుండానే చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు అందరూ వాడేసుకుంటారు.
ఈ క్రమంలోనే దీపావళి టపాసులు తయారుచేసే సంస్థలు కూడా బాక్సులపై పలు హీరోయిన్స్ ఫోటోలు వాడేస్తుంటారు. అయితే నిన్న దీపావళి నాడు హీరోయిన్ శోభిత తన ఫొటో ఉన్న కాకరపువ్వొత్తి బాక్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ దీపావళి టపాసుల షాప్ వద్ద ఎవరో శోభిత ఫొటో ఉన్న కాకారపువ్వొత్తి బాక్స్ ని ఫొటో తీసి ఆమెకు పంపించడంతో ఇలా ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఇలా వెరైటీగా దీపావళి విశేష్ చెప్పడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇక శోభిత ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటుంది. అలాగే త్వరలో నాగచైతన్యని వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్టు పలు ఫొటోలు ఇటీవల షేర్ చేసింది శోభిత.
Also Read : NTR : ‘దేవర’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి.. అభయ్ రామ్ ఎంత పెద్దోడు అయ్యాడో..