Site icon HashtagU Telugu

Naga Chaitanya- Sobhita: ఇరు కుటుంబాల స‌మ‌క్షంలోనే నాగచైత‌న్య‌- శోభితా నిశ్చితార్థం.. ఫొటోలు ఇదిగో..!

Naga Chaitanya- Sobhita

Naga Chaitanya- Sobhita

Naga Chaitanya- Sobhita: అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగాక తొలిసారి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Naga Chaitanya- Sobhita) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాబోయే భర్తతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. చైతూతో ఫొటో దిగుతూ ఆమె మురిసిపోయారు. ‘కురుంతోగై’లోని ఏకే రామానుజన్‌ రాసిన కొటేషన్‌ను షేర్ చేశారు. కాగా ఇరువురి కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. శోభిత విడుద‌ల చేసిన ఫొటోల్లో నాగ చైత‌న్య‌, శోభిత చాలా ఆనందంగా క‌నిపిస్తున్నారు. ఈ ఫొటోల‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తూ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

అయితే గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ మీడియా ముఖంగానే వాటిని ఖండించి త‌మ మ‌ధ్య ఏం లేద‌ని చెప్పేశారు. గ‌తంలో సమంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ‌చైత‌న్య కొన్నేళ్ల‌పాటు కాపురం చేసి ఆ త‌ర్వాత విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారిద్ద‌రూ త‌మ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న విడిపోతున్నట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. దీంతో ఇద్ద‌రి ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

Also Read: Russia Vs Ukraine : రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. కస్క్‌లో రష్యా ఎమర్జెన్సీ.. సుద్జాలో భీకర పోరు

త‌మ మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ లేద‌ని చెప్పిన వీరిద్ద‌రూ తాజాగా నిశ్చితార్థం చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఆగస్టు 8వ తేదీన ఉద‌యం 9.42 గంట‌ల‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు హీరో అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫొటోలు విడుద‌ల చేశారు. అలాగే శోభితాను త‌మ కుటుంబంలోకి సాద‌రంగా ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఈ శుభ కార్య‌క్ర‌మానికి నాగార్జున కుటుంబ స‌భ్యులు, శోభితా కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. త్వ‌రలోనే వీరి పెళ్లి తేదీని కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక‌పోతే నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ మూవీలో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. గీతా ఆర్ట్స్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తుంది. ఇప్ప‌టికే ఈ మూవీ చాలావ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకుంద‌ని స‌మాచారం.