Site icon HashtagU Telugu

Chaitu-Shobitha : శోభితతో నాగచైతన్య.. పిక్ మాములుగా లేదు

Chaitu Shobitha

Chaitu Shobitha

అతి త్వరలో శోభిత(Sobhita Dhulipala)తో కలిసి జీవితం పంచుకోబోతున్న నాగచైతన్య (Naga Chaitanya)..తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కాబోయే భార్య తో దిగిన స్టైలిష్ పిక్ ను పోస్ట్ చేసి..అభిమానుల్లో సంతోషం నింపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత (Samantha) కు విడాకులు ఇచ్చిన చైతు..త్వరలో రెండో పెళ్లికి సిద్ధం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. చాలా రోజులుగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దాటవేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యారు. అది కూడా ఎంగేజ్‌మెంట్‌ తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఎంగేజ్‌మెంట్‌ తాలూకా పిక్స్ తో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయలేదు.

తాజాగా చైతు.. శోభితా ధూళిపాళ్లతో కలిసి దిగిన ఫొటోను ఫస్ట్ టైం సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఓ లిఫ్ట్‌లో దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​లో పోస్ట్‌ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ పిక్‌ శోభిత తీసినట్లు స్పష్టమవుతోంది. నాగ చైతన్య లిఫ్ట్‌లోని మిర్రర్‌ వైపు చూస్తూ ఫొటోకి పోజు ఇవ్వగా.. శోభిత మిర్రర్​లో కనిపించే ఇద్దరి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ జంట ఫొటోలో ట్రెండీగా కనిపిస్తోంది. ఇద్దరూ స్టైలిష్ కళ్లద్దాలు ధరించి బ్లాక్ ఔట్​ఫిట్​లో ఉన్నారు. చూస్తుంటే ఎక్కడికో షాపింగ్​కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ‘Everything everywhere all at once’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. చైతూ పోస్ట్‌ చేసిన వెంటనే ఫొటో వైరల్‌గా మారింది. గంటలో ఈ పోస్ట్​కు లక్షకుపైగా లైక్‌లు వచ్చాయి.

ఇక చుట్టు సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రేమమ్ ఫేమ్ చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రం బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 13 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Read Also : Bhatti Vikramarka : రాహుల్ గాంధీతో భట్టి విక్రమార్క సమావేశం