నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)..తాజాగా అక్కినేని వారి కోడలు అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో ఉన్న ఈ భామ..డిసెంబర్ 04 న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో లో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. కాగా ఈ పెళ్లి తాలూకా పిక్స్ వైరల్ అవుతుండగా..శోభిత వేసుకున్న నగల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఆ నగల ఖరీదే..
మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) చిత్రంలో ఐశ్వర్యరాయ్, త్రిష (Aishwarya Rai, Trisha) వేసుకున్న నగల (Gold) మాదిరే..ఇప్పుడు శోభిత వేసుకున్న నగలు ఉండడం తో ఆ మోడల్ లో శోభిత చేయించుకొని వేసుకుంది అంత మాట్లాడుకుంటున్నారు. PS1 లో ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ,కార్తి ,జయం రవి లతో శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. అప్పట్లోనే ఆ నగల గురించి అంత మాట్లాడుకోవడం జరిగింది. సినిమాలో మీరు ధరించిన నగలన్నీ నిజమైనవేనా అని నేరుగా త్రిష ను అడగడం జరిగింది. దానికి ఆమె తాను ధరించిన నగలన్నీ నిజమైనవే అని తెలియజేసింది. నేను పోషించిన ఈ కుందమై పాత్ర పట్ల చాలా శ్రద్ధ కూడా తీసుకున్నానని.. ఆనాటి రాజుల యొక్క ఆహారం వారు వేసుకుని దుస్తులు నగలను కూడా ఎంపిక చేశారని తెలిపింది. అలా కొన్ని సన్నివేశాలలో .. తాను నిజమైన నగలనే ధరించానని తెలియజేసింది త్రిష. సో ఆ నగలు పురాతన కాలంలో మహారాణులు మాత్రమే ధరించారు. ఇప్పుడు అచ్చం వాటి మాదిరే శోభిత తయారుచేయించుకొని వేసుకున్నట్లు ఉందని పెళ్లి పిక్స్ చూసిన వారంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నగల ఖరీదు కోట్లలో ఉండవచ్చని అనుకుంటున్నారు.
Read Also : Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన!