Ali : అలీని హీరోగా వద్దన్నా దర్శకుడు వినలేదు.. వద్దన్నా వాళ్ళే సినిమా రిలీజ్ అయ్యాక..

అలీకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే.. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యమలీల’(Yamaleela) చిత్రం.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 09:30 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అలీ(Ali).. కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా నటించి ఆడియన్స్ ని మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అలీ నటించారు. 1979లో బాల నటుడిగా కెరీర్‌ ని స్టార్ట్ చేసిన అలీ.. ఆ తర్వాత కమెడియన్ గా పలు సినిమాలు చేసి 1994లో హీరోగా పరిచయమయ్యారు. అలీకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే.. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యమలీల’(Yamaleela) చిత్రం. సోషియో ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అలీ కెరీర్ లోనే కాదు తెలుగు సినీ పరిశ్రమలో కూడా గుర్తుండిపోయే చిత్రంలా నిలిచింది.

ఈ కథ రాసుకున్నప్పుడే అలీని హీరోగా తీసుకోవాలని ఎస్వీ కృష్ణారెడ్డి(SV KrishnaReddy) నిర్ణయించుకున్నారట. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది కృష్ణారెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టారు. అలీని హీరోగా వద్దని సలహా ఇచ్చేరట. కానీ కృష్ణారెడ్డి ఆ కథకి అలీ అయితేనే సరిపోతాడని భావించి సినిమాని తెరకెక్కించారు.

ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత అలీని హీరోగా వద్దని చెప్పిన వారే.. అలీ నటన చూసి హ్యాట్సాఫ్ అన్నారు. ముఖ్యంగా మూవీలో తల్లి చనిపోతుందని తెలుసుకున్న సీన్ దగ్గర అలీ పలికించిన హావభావాలు విమర్శకుల నుంచి చప్పట్లు వచ్చేలా చేసింది. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డే ఈ సినిమాకి సంగీతం అందించారు. ముఖ్యంగా ‘సిరులొలికించే చిన్ని నవ్వులే’ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆకట్టుకుంటే.. ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’ సాంగ్ యూత్ ని ఒక ఊపు ఊపేసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్రజ, యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నటించి మెప్పించారు.

 

Also Read : Salaar : సలార్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా?