Baby Hindi Tamil Remake సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 10 కోట్ల బిజినెస్ తో రిలీజ్ కాగా 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బేబీ సినిమాతో తెలుగు అమ్మయి వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోయింది. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు క్రేజ్ ఉండదు. అవకాశాలు రావు అన్న వారికి ఈ సినిమాతో సమాధానం దొరికింది.
We’re now on WhatsApp : Click to Join
ఇదిలాఉంటే బేబీ సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని అఫీషియల్ గా నిర్మాత ఎస్.కె.ఎన్ చెప్పారు. తమిళంలో ముందు.. ఆ తర్వాత హిందీలో బేబీ రీమేక్ చేస్తున్నామని అన్నారు. అయితే నటీనటులు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని అన్నారు.
రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ కు అటెండ్ అయిన ఎస్.కె.ఎన్ బేబీ సినిమా రీమేక్ విషయాన్ని ప్రకటించారు. హిందీలో బేబీ రీమేక్ కు భారీ ఆఫర్లు వస్తున్నట్టు చెప్పారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో హంగామా చేస్తుండగా బేబీ లాంటి చిన్న సినిమాలు కూడా హిందీ మార్కెట్ లో భారీ రేంజ్ తెచ్చుకున్నాయి.
అయితే అక్కడ నేటివిటీకి తగినట్టుగా బేబీ రీమేక్ ఉంటుందని తెలుస్తుంది. మరి డైరెక్టర్ గా సాయి రాజేష్ వర్క్ చేస్తాడా లేదా మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.
Also Read : Priyanka Singh : బాత్ టబ్ లో బిగ్ బాస్ బ్యూటీ.. ఇది నా జాబ్ లో భాగం.. తప్పుగా అనుకోవద్దంటుంది..!
