SKN : మరో యూట్యూబర్ బేబీ ని హీరోయిన్ గా పెట్టి ..బేబీ నిర్మాత సినిమా

ఇప్పుడు మూడో చిత్రానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో కూడా మరో యూట్యూబర్ బేబీ ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు

Published By: HashtagU Telugu Desk
Skn 3rd Film

Skn 3rd Film

సినిమాలపై పిచ్చి తో చిత్రసీమలో అడుగుపెట్టిన SKN ..ఆ తర్వాత డిస్ట్రబ్యూటర్ గా సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా బేబీ (Baby) తో నిర్మాతగా భారీ విజయం అందుకొని టాప్ ప్రొడ్యూసర్స్ జాబితాలో చేరిపోయాడు. బేబీ హిట్ తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. బేబీ మూవీ తో హీరోయిన్ గా చిత్రసీమ కు యూట్యూబర్ అయినా వైష్ణవి (Vaishnavi Chaitanya) ని పరిచయం చేసిన SKN ..రెండో సినిమాలోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసాడు. ఇక ఇప్పుడు మూడో చిత్రానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో కూడా మరో యూట్యూబర్ బేబీ ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

సంతోష్ శోభన్ (Santoshsoban), యూట్యూబర్ అలేఖ్య హారిక (Harika Alekhya) జంటగా సుమన్ పాతూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి SKN ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి రాజేష్ కథను అందిస్తున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అక్కినేని నాగచైతన్య ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్ లో సంతోష్, అలేఖ్య పెదవి ముద్దు పెడుతూ కనిపించారు. ఇక దీనికి కొన్ని ప్రేమకథలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి అని చెప్పుకురావడం బేబీ సినిమాను గుర్తుచేస్తుంది.

Read Also : Amala Paul Lip Lock : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన అమలా పాల్ ఘాటైన ‘ముద్దు’

  Last Updated: 30 Oct 2023, 03:31 PM IST