Site icon HashtagU Telugu

Skanda Trailer Talk : బోయపాటి మార్క్ యాక్షన్

Skanda Trailer

Skanda Trailer

యాక్షన్ ప్రియులకు బోయపాటి (Boyapati Sreenu) సినిమా అంటే ఫుల్ మిల్స్ దొరికినట్లే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) – బోయపాటి కాంబో అంటే అది బాక్స్ ఆఫీస్ వద్ద యాక్షన్ హిట్ కొట్టినట్లే అని నమ్ముతారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. ఇక ఇప్పుడు బోయపాటి నుండి మరో యాక్షన్ మూవీ రాబోతుంది.

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రామ్ (Ram Pothineni)..ఇప్పుడు బోయపాటి శ్రీను తో కలిసి స్కంద అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా ఫేమ్ శ్రీ లీల (Sree Leela) హీరోయిన్ నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ (Thaman) మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు (ఆగ‌స్టు 26 శ‌నివారం) హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న చేతుల మీదుగా స్కంద ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Read Also : Pooja Hegde : నిమిషానికి లక్ష ఛార్జ్ చేస్తున్న పూజా హగ్దే..వ్యాపారం గట్టిగానే ఉందిగా..!

(Skanda Trailer) ట్రైలర్ విషయానికి వస్తే..బోయ‌పాటి యాక్ష‌న్ అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. హైద‌రాబాదీ స్లాంగ్‌లో హీరో రామ్ చెప్పిన డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇయ్యాలే.. పొయ్యాలే.. గ‌ట్టిగా అరుస్తే తొయ్యేలే…అడ్డ‌మొస్తే లేపాలే , దెబ్బ తాకితే సౌండ్ గోల్కోండ దాటాలా…శాల్తీ శాలిబండ చేరాలా అంటూ రామ్ చెపుతున్న డైలాగ్స్ వింటుంటే సినిమా ఓ రేంజ్ లో తెరకెక్కిందని అర్ధం అవుతుంది. గ‌త సినిమాల‌కు భిన్నంగా స్కంద మూవీలో ఊర మాస్ పాత్ర‌లో రామ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. పూర్తిగా యాక్ష‌న్ అంశాలు, హీరోయిజం, పంచ్ డైలాగ్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం యాక్షన్ ప్రియులతో పాటు రామ్ ఫ్యాన్స్ కు ఇది పూర్తి యాక్షన్ మీల్స్ సినిమా అన్నట్లు చెప్పొచ్చు. మరి ఈ యాక్షన్ కు థియేటర్స్ ఎలా దద్దరిల్లుతాయో చూడాలి.

Exit mobile version