Site icon HashtagU Telugu

Skanda : ‘స్కంద’ ట్రైలర్ టాక్..మాస్ ఆడియన్స్ కు పూనకాలే

Skanda Trailer Talk

Skanda Trailer Talk

రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కంద ట్రైలర్ వచ్చేసింది. హీరో రామ్ (Ram) – మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ). ధమాకా ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 28 న భారీ ఎత్తున పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో స్కంద మూవీ తాలూకా యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచారు.

ఈ ట్రైలర్ ని పూర్తి యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ‘రింగులో దిగితే రీసౌండ్ రావాలి’ అనే బోయపాటి మార్క్ డైలాగ్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. ఈ మూవీలో బోయపాటి మూడు యాక్షన్ సీక్వెన్స్ ని హైలైట్ గా డిజైన్ చేశాడని, సినిమాకే అవి హైలైట్ కాబోతున్నాయని రామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్లు చూస్తుంటే రామ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. అలాగే థమన్ BGM మరోసారి అదరగొట్టాడని తెలుస్తుంది. అఖండ లో ఎలాగైతే థియేటర్లలో బాక్సలు బద్దలు అయ్యాయో..స్కంద లో అంతకు మించి అనేలా కొట్టాడని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. శ్రీ లీల తనదైన గ్లామర్ తో పాటు రామ్ తో పోటీపడి డాన్సులు వేసింది. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. రేపు థియేటర్స్ లలో ఏ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version