యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) – రామ్ (Ram) కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda). ధమాకా ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా శ్రీకాంత్ , ఇంద్రజ , ప్రిన్స్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేని రామ్..అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి..వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడం..ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడం తో సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరిగింది.
దీంతో ‘స్కంద’ రైట్స్ దక్కించుకునేందుకు అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు (Skanda OTT & Satellite Rights) భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ (Skanda OTT Platform)ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా చానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ ధరకి ఓటీటీ, సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా ‘స్కంద’ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ డిజిటల్, సాటిలైట్ హక్కులు ఏకంగా రూ. 45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
Read Also : Tulsi for Acne : తులసి ఆకులతో ఇలా చేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మటుమాయం?
జి స్టూడియో సంస్థ పై పవన్ కుమార్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.