Skanda: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ మౌత్ టాక్ తో ప్రారంభమై బి,సి సెంటర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. లాంగ్ వీకెండ్‌లో విడుదలైన ఈ చిత్రం రూ. ఇప్పటివరకు 43.9 కోట్ల గ్రాస్. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడంతో అది సరిపోదు. సినిమా సేఫ్ జోన్‌లో ఉండాలంటే రానున్న రోజుల్లో మరింత వసూళ్లు రాబట్టాలి.
ముందుగా ఈరోజు సెలవు దినం కావడంతో స్కందకు పెద్దమొత్తంలో డబ్బులు రావాలి లేదంటే కష్టమే. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వరకు వసూలు చేస్తుందో చూడాలి. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించాడు. బోయపాటి శ్రీను మ్యాజిక్‌కు రామ్ నటన తోడై ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.
రెండో రోజు జోరు కాస్త తగ్గినా.. మంచి వసూళ్లనే రాబట్టింది. మాస్ కా బాప్ రేంజ్‌లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి శ్రీను.. లవర్ బోయ్ రామ్‌ను హ్యాండిల్ చేసిన విధానం మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ‘స్కంద’ మూవీ మొదటి రోజు.. రూ. 10.57 కోట్ల షేర్ (రూ. 17.20 కోట్ల గ్రాస్) రెండో రోజు.. రూ. 4 కోట్లు.. (7.10 కోట్లు గ్రాస్) రాబట్టింది. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా, బోయపాటి ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు.
Also Read: Chiranjeevi Trust: నేటితో చిరంజీవి ట్రస్టుకు 25 ఏళ్లు, మెగాస్టార్ ఎమోషనల్ మెసేజ్ !