Skanda Collections : రెండో రోజు స్కంద కలెక్షన్ల డ్రాప్..

రెండో రోజు కలెక్షన్స్ చూస్తే..నైజాంలో రూ. 1.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 02:04 PM IST

హీరో రామ్ (Ram) – మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ). ధమాకా ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటించగా..థమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల నడుమ Sep 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టినప్పటికీ..రెండో రోజు మాత్రం కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి.

రెండో రోజు కలెక్షన్స్ చూస్తే..నైజాంలో రూ. 1.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 3.50 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

రెండు రోజులు కలిపి స్కంద వసూళ్లు చూస్తే..నైజాంలో రూ. 4.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో కలిపి.. రూ. 12.12 కోట్లు షేర్, రూ. 19.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.57 కోట్లు షేర్‌, రూ. 24.30 కోట్లు గ్రాస్‌ను వసూలు రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చూస్తే..మరో రూ. 32.43 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ జాబితాలోకి వస్తుంది. మరి ఆ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో లేదో చూడాలి.