ఖుషి ఫేమ్ డైరెక్టర్ SJ సూర్య ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (SJ Suryah – Pawan Kalyan)మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో 2001 లో ఖుషి (Kushi)మూవీ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు..టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు ను బ్రేక్ చేయడమే కాదు..ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో కొమరం పులి మూవీ..భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటి..బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికి వీరి ఫై ఉన్న అభిమానం మాత్రం అభిమానుల్లో ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సూర్య.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.
తాజాగా శంకర్ – కమల్ హసన్ కలయికలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2) మూవీ లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ (Indian 2 Pre Release Event) వేడుక నిన్న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్బంగా SJ సూర్య మాట్లాడుతూ..”కమల్ హాసన్ గారు చెప్పారు. దర్శకుడు శంకర్ గారి కాన్సెప్టులో ఉంది. ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గొప్ప పనులు చేశారో… వారు ‘ఇండియన్’ అని చెప్పారు. ప్రతి ఒక్కరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి నేను ఇక్కడ ఇంకో పాయింట్ అందరితో పంచుకోవాలి. అటువంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండీ. నేను ముందే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా స్నేహితుడు అని ఒక రోజు గౌరవంగా చెబుతానని నేను మూడు సంవత్సరాల క్రితం చెప్పాను. సగం ప్రూవ్ అయ్యింది. మిగతా సగం మీరే (వేదిక ముందు ఉన్న ప్రేక్షకులను ఉద్దేశిస్తూ…) చేయాలి” అని ఎస్‌జే సూర్య అన్నారు. ఆయన మాటలకు ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది.
We’re now on WhatsApp. Click to Join.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ , బిజెపితో కలిసి బరిలోకి దిగి భారీ విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి రాజకీయ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీ గా జనసేన నిలిచింది. ప్రస్తుతం పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యత చేపట్టాడు.
ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు భారతీయుడు 2 ఈవెంట్లో తమిళ్ ఆక్టర్ ఎస్. జే. సూర్య #SjSuriyah #pawankalyan #andhrapradeshcm #HashtagU pic.twitter.com/hf9ZD6yTZK
— Hashtag U (@HashtaguIn) July 8, 2024
Read Also : YSR Birth Anniversary: వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి